LOADING...
IND vs PAK: పాక్‌పై ఘన విజయం.. భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన సెలబ్రిటీలు
పాక్‌పై ఘన విజయం.. భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన సెలబ్రిటీలు

IND vs PAK: పాక్‌పై ఘన విజయం.. భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన సెలబ్రిటీలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకపక్షంగా ఓడించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎప్పటిలాగే దుమ్ముదులిపే ప్రదర్శన చేసిన భారత జట్టుపై పలువురు సినీ ప్రముఖులు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ అభినందనలు తెలిపారు. ఫార్మాట్లు మారినా, వేదికలు మారినా, తేదీలు మారినా ఫలితం మాత్రం అదే అంటూ భారత జట్టు ఆధిపత్యాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. ఎంత బాగా ఆడారు.. వావ్‌ అనిపించే మ్యాచ్‌ ఇది. అద్భుతమైన విజయానికి శుభాకాంక్షలని నటుడు అజయ్ దేవగన్ అని అభినందించారు.

Details

భారత జట్టుకు అభినందనల వెల్లువ

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన భారత జట్టుకు అభినందనలు. దేశానికి గర్వకారణమైన క్షణాలు ఇవి అని మలయాళ స్టార్ ముమ్మట్టి పేర్కొన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో సూపర్‌-8లోకి ప్రవేశించారు. దుమ్ముదులిపేలా ఆడారు. అభినందనలు మెన్‌ ఇన్‌ బ్లూ అంటూ నటుడు అర్జున్ రాంపాల్ ప్రశంసించారు. హరహర మహాదేవ్‌.. ఈ శివరాత్రికి ఇది భారీ విజయం అని అనుపమ్ ఖేర్ ఆనందం వ్యక్తం చేశారు. మేం ఎప్పుడూ గెలుస్తాం.. భారత్‌ ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుందంటూ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ జట్టును ప్రశంసించారు. మొత్తంగా, పాకిస్థాన్‌పై మరోసారి విజయం సాధించిన టీమ్‌ఇండియాకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Advertisement