LOADING...
PBKS vs KKR: చాహల్‌ మాయాజాలం.. కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం
చాహల్‌ మాయాజాలం.. కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

PBKS vs KKR: చాహల్‌ మాయాజాలం.. కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
10:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కాగా, తర్వాత 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ (37) ఒక్కడే పోరాడినప్పటికీ మిగిలినవారు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ చక్కటి బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు తీసుకోగా, మార్కో యాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు.

Details

3 వికెట్లు పడగొట్టిన హర్షిత్ రాణా

జేవియర్ బార్లెట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అర్ష్‌దీప్ సింగ్‌లు తలో వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశారు. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు 111 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30), ప్రియాంశ్ (22) మాత్రమే పోరాడగలిగారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో 2 వికెట్లు తీశారు. అన్రిచ్ నోకియా, వైభవ్ చెరో వికెట్ తీసి తమ బాధ్యతను నిర్వర్తించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

16 పరుగుల తేడాతో పంజాబ్ విజయం