Page Loader
మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చాహెల్, జోరూట్ (వీడియో)
డాన్స్ చేస్తున్న చాహెల్, జోరూట్

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చాహెల్, జోరూట్ (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్‌లో మొదటిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు. ఇంకా మ్యాచ్ కూడా ఆడని, అతను తన తీన్ మార్ స్టెప్పులతో అభిమానులను అలరిస్తున్నాడు. టీమిండియా స్పిన్నర్ యుజేంద్ర చాహెల్‌తో కలిసి ఓ హిందీ పాటకు జో రూట్ డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లను ఆడింది. రెండింటిలో ఒకటి విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. అయితే జోరూట్, చాహెల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను జట్టు యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతాలో చేసింది.

రాజస్థాన్ రాయల్స్

ఏప్రిల్ 8న ఢిల్లీతో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ యాజమాన్యం రూ. కోటి రూపాయలకు జో రూట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తీరక దొరికినప్పుడల్లా రాజస్థాన్ ప్లేయర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భ‌రోసా తేరి ప్యార్ తే' పాట‌పై జో రూట్, చాహెల్ డాన్స్ చేయడంతో క్రికెట్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డాన్స్ చేస్తున్న చాహెల్, జో రూట్