
Champak: చంపక్ ఎంట్రీతో ఐపీఎల్‌లో కొత్త హంగామా.. దీని ప్రత్యేకతలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారిన రోబోటిక్ డాగ్‌కు తాజాగా 'చంపక్' అనే పేరు పెట్టారు. ఐపీఎల్ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇటీవల నిర్వహించిన ఓపెన్ పోల్‌లో అభిమానుల ఓట్ల ఆధారంగా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలిపారు. "మీట్ చంపక్!" అంటూ సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ముంబయి ఇండియన్స్ (ఎంఐ) మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఈ పేరును అధికారికంగా ప్రకటించారు.
ఈ సీజన్‌లో 'చంపక్' ఆడియన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ ఆకర్షణీయంగా మారింది. .
Details
అభిమానుల మనసు దోచుకుంటున్న చంపక్
ఆటగాళ్ల వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేయడం, ఆటగాళ్లు కూడా దీన్ని చుట్టూ తిరుగుతూ సరదాగా వ్యవహరించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రోబో శక్తివంతమైన ఫీచర్లతో రూపొందించారు. ఇది పరిగెత్తగలదు, నడవగలదు, దూకగలదు, కూర్చునేలా కూడా ప్రోగ్రామింగ్ చేశారు.
ముందు భాగంలో అమర్చిన కెమెరా సహాయంతో ప్రేక్షకులకు వినూత్న వీక్షణ అనుభవాన్ని అందిస్తోంది. మానవ హావభావాలను అనుకరించగలిగే విధంగా ఇది రూపుదిద్దుకుంది.
ఈ విధంగా 'చంపక్' అనే రోబోటిక్ డాగ్, ఐపీఎల్ 2025 సీజన్ బ్రాడ్‌కాస్టింగ్‌లో భాగంగా మారి స్టేడియాల్లో సందడి చేస్తూ, అభిమానుల మనసు దోచుకుంటోంది