Page Loader
MS Dhoni: ధోనీ స్టైల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో.. వైరల్ అవుతున్న వీడియో 
ధోనీ స్టైల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో.. వైరల్ అవుతున్న వీడియో

MS Dhoni: ధోనీ స్టైల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో.. వైరల్ అవుతున్న వీడియో 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్‌ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఐసీసీ ట్రోఫీని మళ్లీ దక్కించుకునేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. ఈసారి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ ఆరంభం కానుంది. భారత జట్టు ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన ప్రోమో వీడియోలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెప్టెన్‌గా తాను ఎప్పుడూ కూల్‌గా ఉన్నానని, కానీ ఇప్పుడు అభిమానిగా మ్యాచులు చూస్తుండటంతో హీట్ పెంచుతోందని ధోనీ చెప్పాడు.

Details

ధోనీ రిఫ్రిజిరేషన్‌ సిస్టమ్ (DRS) 

ఈ ప్రోమోలో ధోనీ తనదైన స్టైల్లో కనిపించాడు. పోటీ తీవ్రత గురించి చెబుతూ, 'తాను కెప్టెన్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడానని, మైదానంలో ఎప్పుడూ కూల్‌గా నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. కానీ అభిమానిగా మ్యాచ్‌లను చూస్తుంటే టెన్షన్ పెరుగుతోందని, ఒక్క మ్యాచ్ కోల్పోయినా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో నాలోనూ టెంపరేచర్ పెరుగుతోందని ధోనీ తెలిపాడు. ఈ సందర్భంగా ధోనీ పూర్తిగా ఐస్ గడ్డలతో తయారైన దుస్తులు, టోపీ ధరించి కనిపించాడు. ఐస్ ట్యాంకర్లతో తీసుకొచ్చి ముంచినా కూడా హీట్ తగ్గడం లేదని నటించాడు. చివరగా థర్డ్ అంపైర్‌కు తనదైన స్టైల్లో 'ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ (DRS)' కావాలని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో