
IPL 2026: ఇప్పుడే ఛాన్స్.. జట్టు మారాలనుకుంటున్న ఆటగాళ్లు ఎవరు?
ఈ వార్తాకథనం ఏంటి
2025 సీజన్ ముగియడంతో, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు IPL 2026 వైపు మళ్లింది. సరికొత్త సీజన్‌కు ముందు, ఫ్రాంచైజీలు తమ బలాబలాలను విశ్లేషించుకొని జట్లు పటిష్టం చేసుకోవడానికి 'ట్రేడింగ్ విండో' కీలక మైలురాయిగా నిలవనుంది. ఆటగాళ్ల మార్పిడులకు సంబంధించి ఈ దశలో జరిగే చర్యలు, నియమాలు, ముఖ్యమైన తేదీలు తెలుసుకోవాల్సిన సమయం ఇది.
Details
ట్రేడింగ్ విండో అంటే ఏంటి?
ట్రేడింగ్ విండో అనేది ఐపీఎల్ వేలానికి ముందు, తర్వాత జరిగే కాలం. ఈ సమయంలో జట్లు ఆటగాళ్లను ఇతర జట్లకు బదిలీ చేయవచ్చు. ఈ మార్పిడులు నగదు రూపంలో (All-cash) గానీ, ఆటగాళ్ల మార్పిడిగా (Player-for-player trade) గానీ జరగవచ్చు. ఉదాహరణకు, ఒక జట్టు నిర్దిష్ట ఆటగాడిని సంపాదించాలనుకుంటే, నగదు చెల్లించవచ్చు లేదా తమ జట్టులోని మరొక ఆటగాడిని బదులుగా ఇవ్వవచ్చు. ఐపీఎల్ 2026 ట్రేడింగ్ విండో కీలక తేదీలు ప్రీ-ఆక్షన్ ట్రేడ్ విండో ప్రారంభం: 2025 జూన్ 10 (IPL 2025 ముగిసిన 7వ రోజు) ముగింపు : IPL 2026 వేలానికి 7 రోజులు ముందు (సాయంత్రం 5గం IST)
Details
పోస్ట్-ఆక్షన్ / ప్రీ-టూర్నమెంట్ ట్రేడ్ విండో
ఈ దశలో జట్లు తమ ప్రస్తుత ప్లేయర్ల పనితీరును సమీక్షించుకొని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటాయి. ఇదే సమయంలో రిటెన్షన్ ప్రక్రియలు, మొదటి దశ బదిలీలు జరుగుతాయి. ప్రారంభం : IPL 2026 వేలం ముగిసిన వెంటనే (ఉదయం 9గం IST) ముగింపు : IPL 2026 టోర్నమెంట్ ప్రారంభానికి 30 రోజులు ముందు