
Team India ODI Captain: టీమిండియా కెప్టెన్సీలో మార్పులు.. రోహిత్ శర్మను పక్కన పెట్టనున్న బీసీసీఐ?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని టెస్ట్ సిరీస్‌లుగా ఫామ్ లేకపోవడంతో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శన, తదనంతరం ఇంగ్లాండ్ టూర్‌లో అంతంతమాత్రంగా రాణించడం వంటి అంశాల నేపథ్యంలో టెస్టుల నుంచి వైదొలిగే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే టెస్టుల్లో నిరంతర ఆటతీరు లేకపోయినప్పటికీ వన్డే, టీ20ల్లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లోనే కొనసాగుతున్నారు. వన్డేల్లో భారత జట్టుకు అనేక విజయాలు అందించిన ఆయన.. ఇప్పుడు 2027 వన్డే వరల్డ్‌కప్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ ప్రయాణంలో విరాట్ కోహ్లీతో కలసి వన్డేల్లో ఆడాలని ఆయన నిర్ణయించినట్టు సమాచారం. ఇక వన్డే కెప్టెన్సీ విషయంలో కొత్త చర్చలు తెరపైకి వచ్చాయి.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
ఇటీవల ఓ ప్రముఖ క్రీడా జర్నలిస్టు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రకారం, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టుకు వచ్చే సిరీస్ నుంచే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టెస్టుల్లో గిల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వన్డే కెప్టెన్సీకి కూడా అతడే అభ్యర్థిగా బీబీగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ పగ్గాలు గిల్‌కి అప్పగించాలనే అంశంపై బీసీసీఐ ఇప్పటికే రోహిత్ శర్మతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. రోహిత్ నిర్ణయాన్నిబట్టి గిల్ కెప్టెన్సీపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Details
గిల్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్
అంతేకాదు, శ్రీలంకతో జరగే వన్డే సిరీస్‌కు గిల్‌నే సారథిగా నియమించనున్నారని, అదే సమయంలో టీ20 ఫార్మాట్‌లో కూడా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అతనికి అప్పగించనున్నట్టు పలు నేషనల్ మీడియా కథనాలు తెలిపాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చే నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు ఇంకా రోహిత్ జట్టులో ఉండగానే ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, టెస్ట్‌లకు రోహిత్ గుడ్‌బై చెప్పడం, వన్డే కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కి అప్పగించే ప్రక్రియ మొదలవుతుండటం - టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.