Page Loader
IND vs BAN: రెండో టీ20లో మార్పులు.. నితీష్ అవుట్.. హర్షిత్ రాణా అరంగేట్రానికి సర్వం సిద్ధం!
రెండో టీ20లో మార్పులు.. నితీష్ అవుట్.. హర్షిత్ రాణా అరంగేట్రానికి సర్వం! సిద్ధం

IND vs BAN: రెండో టీ20లో మార్పులు.. నితీష్ అవుట్.. హర్షిత్ రాణా అరంగేట్రానికి సర్వం సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు రెండో టీ20కి సిద్దమవుతోంది. అక్టోబర్ 9న దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం దిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సూర్య సేనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో, రెండో టీ20లో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు సమాచారం.

Details

రెండో టీ20

తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డిని ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టాలనుకుంటున్నారు. అతని స్థానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున, భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్యాటింగ్ అనుకూలత కారణంగా వీక్షకులు ఈ మ్యాచ్‌లో ఆడేటప్పుడు భారత్ నుంచి హోరా హోరీ పోరు చూడవచ్చని భావిస్తున్నారు. భారత జట్టులో ఈ మార్పు తప్పితే పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు.

Details

రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హ‌ర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.