Charlie Dean: రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్
ఇంగ్లండ్ యువస్పిన్నర్ చార్జీ డీన్ వన్డే ఇంటర్నేషనల్స్ క్రికెట్ లో చరిత్ర సృష్టించింది. తన స్పిన్ మాయాజాలంతో అత్యంత వేగంగా 50వికెట్ల మైలురాయిని చేరుకుంది. న్యూజిలాండ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో స్పినర్న్ చార్లీ డీన్ కివీస్ బ్యాటర్ బ్రూక్ హల్లీడేను అవుట్ చేసి 50 వికెట్స్ క్లబ్లో చేరిపోయింది. ఈ మ్యాచ్లో 9ఓవర్లు పాటు బౌలింగ్ చేసి 57పరుగులిచ్చి కీలకమైన మూడు వికెట్లను తీసింది. చార్లీ డీన్ కేవలం 26ఇన్నింగ్స్ లోనే 50వికెట్ల మైలురాయికి చేరుకుంది. అంతకుముందు, ఈరికార్డు ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్ స్టోన్ పేరిట ఉంది. ఈమె 27 ఇన్నింగ్స్ లో 50వికెట్లను తీయగా,28 ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ 50 వికెట్లను తీసుకున్నారు.