Page Loader
BCCI: ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు
ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు

BCCI: ఫీల్డింగ్‌లో 'పెనాల్టీ' పరుగులకు చెక్.. బీసీసీఐ నూతన మార్గదర్శకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో మార్పులను తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఫీల్డింగ్ సమయంలో ఉద్దేశపూర్వక తప్పిదాలు లేదా ప్రమాదవశాత్తూ జరిగే కొన్ని పొరపాట్లకు సంబంధించి నిబంధనల్లో సవరణలు చేసింది. ఈ మార్పులు అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నోటిఫికేషన్ రూపంలో పంపినట్లు తెలిసింది. ఇంతవరకు, బ్యాటర్ బంతిని కొట్టి ఫీల్డర్‌ను దాటి వెళ్లేటప్పుడు బంతి అక్కడపడి ఉన్న వస్తువులు, పరికరాలను తాకితే, అది మోసపూరితంగా భావించి బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ పరుగులు ఇస్తారు. అయితే తాజాగా బీసీసీఐ చేసిన మార్పుల ప్రకారం, బంతి ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ పరికరాలను తాకినట్లు కాకుండా పొరపాటుగా తగిలితే, దానికి ఇకపై పెనాల్టీ పరుగులు ఇవ్వరని వెల్లడించింది. ఈ మార్పులు వచ్చే దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల్లో అమలులోకి వస్తాయి.

Details

కొత్త రూల్స్ ఇవే

ఫీల్డింగ్ చేసే ఆటగాడి బంతి పొరపాటున ఏ వస్తువుకు తాకినా, అది డెడ్ బంతిగా పరిగణించరు. వికెట్ కీపర్ గ్లోవ్‌లు లేదా ఫీల్డర్ క్యాప్‌లకు కూడా బంతి తాకినా పెనాల్టీ పరుగులు ఇవ్వరు. అంపైర్లు, ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా బంతిని తాకించలేదని భావిస్తే, ఆ బంతి ఆడిన బంతిగానే పరిగణించి ఆట కొనసాగుతుంది. వికెట్ పడినా అది చెల్లుబాటవుతుంది. అంతకు ముందు పరిస్థితుల్లో, బంతి ఫీల్డింగ్ పరికరాలపై తగిలినప్పుడు డెడ్ బంతిగా పరిగణించి బ్యాటింగ్ జట్టుకు అదనంగా పెనాల్టీ పరుగులు ఇచ్చేవారు. అదనంగా బ్యాటర్లు తీసిన పరుగులు కూడా కలిపి ఇస్తారు.