SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆ ఇద్దరి ఎంట్రీ ఖాయమే! అసలు విషయం చెప్పేసిన సూర్య
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ కోసం భారత్ (SA vs IND) సన్నద్ధమైంది.
ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెఫ్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అయితే , అతను ఓ వంటకం గురించి చెప్పాడు కానీ, అది నిజంగా తినేది కాదు.
మైదానంలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో చెప్పడంలో తన ప్రత్యేకమైన శైలిలో సూర్య వివరించాడు.
ఆ వీడియోను బీసీసీఐ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తన టీమ్ గురించి సూర్య ఆసక్తికరంగా వివరించాడు.
వివరాలు
చట్నీలా ఏకాగ్రత
"హాయ్ ఫ్రెండ్స్... నేను మీకోసం రెండు అద్భుతమైన ప్లేయర్లను తీసుకొచ్చాను. వారు మైదానంలో తమ ప్రతిభను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి ప్లేయర్ ఒక అద్భుతమైన బౌలర్. అతని శక్తి, తెలివితేటలు ఈ కాంబినేషన్‌లో ప్రధానమైనవి. అతడే వైశాఖ్ విజయ్‌కుమార్. ఇక రెండో ప్లేయర్ అత్యంత ధైర్యశాలి, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. ఫుట్‌వర్క్ సూపర్, చట్నీలా ఏకాగ్రత ఉండడం అతని ప్రత్యేకత. పసందైన పొడులు మాదిరిగా షాట్లు కొట్టే టైమింగ్ అతడి సొంతం. ఈ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్. నాకు నమ్మకముంది వారిద్దరూ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శిస్తారని," అంటూ సూర్య తెలిపాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
Captain & Chef 🧑🍳 SKY introduces two ✌️ new f̶a̶c̶e̶s̶ dishes to the t̶e̶a̶m̶ menu 📜
— BCCI (@BCCI) November 8, 2024
𝙍𝙚𝙖𝙙𝙮 𝙏𝙤 𝙎𝙚𝙧𝙫𝙚 - SKY like never seen before #TeamIndia | #SAvIND | @surya_14kumar | @Raman___19 pic.twitter.com/brbznUtiZ6