
GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-2025 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆరంభం నుంచే చెన్నై దూకుడుగా ఆడింది.
ఓపెనర్లు ఆయుష్ మాత్రే (34 పరుగులు, 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు), ఉర్విల్ పటేల్ (37 పరుగులు, 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మంచి ప్రారంభాన్ని అందించారు.
Details
రాణించిన డ్యూవాల్డ్ బ్రెవిస్
అనంతరం, డెవిన్ కాన్వే (52 పరుగులు, 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు), డ్యూవాల్డ్ బ్రెవిస్ (57 పరుగులు, 23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) అర్ధశతకాలతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించారు.
బౌలింగ్ విభాగంలో గుజరాత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసి కొంత మెరుగైన ప్రదర్శన చేశాడు.
సాయి కిశోర్, రషీద్ ఖాన్, షారూక్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.