12 పరుగుల తేడాతో చైన్నై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి పరాజయం పాలైంది. సీఎస్కేకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే కలసి లక్నో బౌలర్లలపై బౌండరీల వర్షం కురిపించారు. రుతుర్వాజ్ 31 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) 57 పరుగులు చేశాడు. కాన్వే 29 బంతుల్లో ( 5ఫోర్లు, 2 సిక్సర్లు) 47 పరుగులు చేశాడు.
రాణించిన మొయిన్ అలీ
వీరిద్దరూ మొదటి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. లక్నో బౌలర్లలో రవి బిషోని మూడు వికెట్లు, మార్క్ వుడ్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్ ఒక వికెట్ తీశారు. ముఖ్యంగా మెయిన్ ఆలీ 4 వికెట్ల చెలరేగడంతో లక్నో ఆశలు అవిరయ్యాయి. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన లక్నోకు శుభారంభం లభించింది. ఓపెనర్ మేయర్స్ సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లో (2 సిక్సర్లు, 8 ఫోర్లు) 53 పరుగులు చేశాడు. స్టోయినిస్ (21), నికోలస్ పూరన్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఒకానొక దశలో లక్నోకు గెలుపు అశలు చిగురించగా.. మొయిన్‌అలీ తన స్పిన్ మాయజలంలో లక్నో బ్యాటర్ల నడ్డి విరిచాడు.