సీఎస్కే బ్యాటర్ల ఊచకోత.. స్కోరు ఎంతంటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన సీఎస్కేకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ లక్నో బౌలర్లకు చుక్కులు చూపించారు. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌లో విజృంభించిన రుతురాజ్ గైక్వాడ్.. అదే ఫామ్ ను కొనసాగించి బౌండరీల వర్షం కురిపించారు. 31 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) 57 పరుగులు చేశాడు. కాన్వే 29 బంతుల్లో ( 5ఫోర్లు, 2 సిక్సర్లు) 47 పరుగులు చేశాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 110 పరుగులు జోడించారు
రాణించిన చైన్నై బ్యాటర్లు
గైక్వాడ్, మార్క్ వుడ్ బౌలింగ్ లో క్యాచ్ ఔటైన తర్వాత క్రీజులోకి శివం దుబే దిగాడు. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో కాన్వే ఔటయ్యాడు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగన బెన్ స్టోక్స్(8) పూర్తిగా నిరాశపరిచారు. శివం దూబే 16 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుతిరిగాడు. చివర్లో అంబటిరాయుడు 14 బంతుల్లో 26 పరుగులతో విజృంభించాడు. ధోని 3 బంతుల్లో 2 సిక్సర్లతో మెరిశాడు లక్నో బౌలర్లలో రవి బిషోని మూడు వికెట్లు, మార్క్ వుడ్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్ ఒక వికెట్ తీశారు. చైన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.