
CSK vs KKR: కేకేఆర్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన చైన్నై సూపర్ కింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో కేవలం 103 పరుగులకు ఆలౌటైంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు ధాటిగా రాణించడంతో చెన్నై బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
అనంతరం లక్ష్య చేధనలో కోల్‌కతా ఓపెనర్లు సునీల్ నరైన్ (44 పరుగులు) క్వింటాన్ డికాక్ (23 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయానికి బలమైన పునాదులు వేశారు.
వీరిద్దరూ చక్కగా ఆడటంతో కేకేఆర్ కేవలం 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
Details
మూడు వికెట్లు పడగొట్టిన సునీల్ నరైన్
ఈ విజయానికి కెప్టెన్ అజింక్యా రహానే మెరుపు ప్రదర్శన కూడా తోడైంది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ ఆహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
మొత్తంగా చూస్తే, చెపాక్ వేదికగా కేకేఆర్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మొదట కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన 3, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపు
Match 25. Kolkata Knight Riders Won by 8 Wicket(s) https://t.co/gPLIYGimQn #CSKvKKR #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 11, 2025