Page Loader
Magnus Carlsen: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న చెస్ దిగ్గం మాగ్నస్ కార్ల్‌సన్
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న చెస్ దిగ్గం మాగ్నస్ కార్ల్‌సన్

Magnus Carlsen: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న చెస్ దిగ్గం మాగ్నస్ కార్ల్‌సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ నంబర్‌వన్‌ చెస్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ వారంలో తన ప్రియురాలు ఎల్లా విక్టోరియా మలోన్‌తో వివాహం చేసుకోనున్నట్లు నార్వే మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ వివాహం ఓ రహస్య ప్రాంతంలో జరగనున్నట్లు సమాచారం. దీనిని కార్ల్‌సన్‌ స్నేహితుడు మాగ్నస్ బార్‌స్టాడ్ ధ్రువీకరించారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం జరుగనున్నట్లు చెప్పారు.

Details

మూడుసార్లు గేమ్ డ్రా

ఇటీవల జరిగిన వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో, మగ్నస్‌ కార్ల్‌సన్‌ రష్యాకు చెందిన ఇయాన్‌ నెపోమ్నియాచితో ఓపెన్‌ విభాగంలో పోటీపడినప్పుడు మూడు సార్లు గేమ్‌ డ్రాగా ముగిసింది. ఫలితంగా టైటిల్‌ను ఇద్దరూ పంచుకోవాల్సి వచ్చింది. కార్ల్‌సన్‌ బ్లిట్జ్‌ టైటిల్‌ కైవసం చేసుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం.