LOADING...
Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా
రాజీనామా చేసిన చేతన్ శర్మ

Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2023
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పదవి నుంచి వైదొలిగాడు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు పంపించాడు. దీనికి జైషా ఆమోదం తెలిపారు. ఇటీవల ప్రముఖ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీని కారణంగానే చేతన్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పలువురు ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకొని ఫిట్ నెస్ పరీక్షలకు హాజరవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌పై ప్రభావం ఉండదు

ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మధ్యలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో సిరీస్ పై ప్రభావం చూపించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐకు చెందిన ఓ సీనియర్ అధికారి స్పందిస్తూ.. సిరీస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని, మిగతా రెండు మ్యాచ్‌లకు జట్టు ఎంపికకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చేతన్ శర్మ తన తప్పును తెలుసుకొని ఆయనే స్వయంగా రాజీనామా చేశారన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీనామా చేసిన చేతన్ శర్మ