LOADING...
Cheteshwar Pujara: క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్‌ పుజారా
క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్‌ పుజారా

Cheteshwar Pujara: క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్‌ పుజారా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సీనియర్ క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పుజారా, భారత్ తరఫున 103 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ ప్రయాణంలో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 అర్ధసెంచరీలు బాదిన ఆయన మొత్తం 7,195 పరుగులు సాధించాడు. అయితే వన్డేల్లో ఆయనకు ఎక్కువ అవకాశాలు దక్కలేదు.

Details

ఐదు వన్డేలు ఆడిన పుజారా

కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా, అందులో 51 పరుగులు చేశాడు. చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడిన పుజారా, అప్పటి నుంచి భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు క్రికెట్‌ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించి తన కెరీర్‌కు ముగింపు పలికాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో పోస్టు చేసిన పుజారా