ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛతేశ్వర్ పుజారా మరో ఘనత
టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మరో ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్‌లో భారత్ తరుపున 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నప్పుడు పుజారా ఈ మైలురాయిని అందుకున్నాడు. సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 91 పరుగులు చేసి సత్తా చాటాడు. పుజారా 241 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 52.01 సగటుతో 18,518 పరుగులకు చేరుకున్నాడు. పుజారా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారతదేశం తరపున ఆడటానికి ముందు తమిళనాడుతో సౌరాష్ట్ర తరపున ఆడనున్నాడు.
టెస్టులో 7వేల పరుగుల చేసిన పుజారా
సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్ తరఫున ఆడుతున్న పుజారా 44.39 సగటుతో 7,014 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. స్వదేశంలో పుజారా 54.39 సగటుతో 3,699 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు ఉన్నాయి. అదే విధంగా సౌరాష్ట్ర తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 415/10 స్కోరు చేసింది. సౌరాష్ట్ర 237 పరుగులకే ఆలౌటైంది. ఇటీవల బంగ్లాదేశ్ టెస్టులో పుజారా మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియా విజయానికి కృషి చేశాడు.