వంద టెస్టులు ఆడి చతేశ్వర్ పుజారా అరుదైన ఘనత
టీమిండియా వర్సస్ ఆస్ట్రేలియా రెండో టెస్టులో మ్యాచ్ చతేశ్వర్ పుజారా వంద టెస్టులు ఆడి అరుదైన ఘనతను సాధించారు. ఈ మైలురాయిని సాధించిన 13వ టీమిండియా ఆటగాడిగా పుజారా నిలిచారు. పుజారా పది సంవత్సరాలుగా టెస్టులో ఆడుతూ మెరుగ్గా రాణిస్తున్నాడు. పుజారా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తర్వాత టెస్టులో నంబర్ త్రీ బ్యాటర్ గా నిలవడం గమనార్హం. ఇప్పటివరకు టెస్టులో అత్యధిక డెలవరీలు (31, 258) ఎదుర్కొన్న ఆటగాడి రాహుల్ ద్రవిడ్ అప్పట్లో రికార్డు సృష్టించాడు. 2012లో ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ అయినప్పుడు టెస్టుల్లో ద్రవిడ్ వారసుడిగా పుజారా నిలిచాడు. పుజారా ఇప్పటివరకు 100 టెస్టులు ఆడి 7,052 పరుగులు చేశాడు.
పుజారా వర్సస్ రాహుల్ ద్రవిడ్
పుజారా ప్రస్తుతం 34 అర్ధ సెంచరీలు, 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. రాహుల్ ద్రవిడ్ 164 టెస్టులు మ్యాచ్ లు ఆడి 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలున్నాయి. పుజారా 49 హోమ్ టెస్టులు ఆడాడు, అందులో అతను 53.38 సగటుతో 3,737 పరుగులు చేశాడు. ద్రావిడ్ మొదటి 100 టెస్టులలో 47 మ్యాచ్‌లు స్వదేశంలో ఆడాడు. అందులో 51.52 సగటుతో 3,761 పరుగులు చేశాడు. ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 500 బంతులను ఎదుర్కొన్న మొట్టమొదటి ఆటగాడిగా పుజారాకు రికార్డు ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారా వరుసగా 7, 0, 31 పరుగులు చేశాడు.