కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా
ఈ వార్తాకథనం ఏంటి
టెస్టు స్పెషలిస్ట్ ఛతేశ్వర్, టీమిండియా బ్యాట్స్‌మెన్ పుజారా కౌంటీ ఛాంపియన్ ఫిప్‌లో విజృంభించారు. ససెక్స్ కెప్టెన్ గా వ్యవహరించిన పుజారా అరంగేట్రం మ్యాచ్ లోనే సెంచరీతో సత్తా చాటాడు. 115 పరుగులు చేసి ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ససెక్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డర్హామ్ 376 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ససెక్స్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన పుజారా 163 బంతుల్లో 115 పరుగులు చేశాడు. దీంతో ససెక్స్ జట్టు 335 పరుగులు చేసింది.
గత సీజన్‌లో భారత టెస్టు జట్టు నుంచి పుజారా తప్పుకోవడంతో ససెక్స్ జట్టులో చేరాడు.
పుజారా
పుజారా సాధించిన రికార్డులివే
కౌంటీ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక పరుగులు(1094) చేసిన నాల్గో బ్యాటర్ గా నిలిచాడు. వేన్ మాడ్సెన్ (1,273), హసీబ్ హమీద్ (1,235), సామ్ నార్త్ఈస్ట్ (1,189) పరుగులు చేసిన అతని కంటే ముందు ఉన్నారు.
గతంలో లార్డ్స్‌లో మిడిల్‌సెక్స్‌పై 403 బంతుల్లో 231 పరుగులతో చేసి పుజారా చరిత్ర సృష్టించాడు. ఐకానిక్ వేదికగా మిడిల్‌సెక్స్‌పై డబుల్ సెంచరీ చేసిన మొదటి సస్సెక్స్ బ్యాటర్‌గా అతను నిలిచాడు.
పుజారా 246 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 51.81 సగటుతో 18,808 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 75 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో పుజారా 102 మ్యాచ్‌ల్లో 43.88 సగటుతో 7,154 పరుగులు చేశాడు.