కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలి : రికీ పాంటింగ్
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నిలో టీమిండియా టైటిల్ ఫెవరెట్‌గా నిలిచింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో నిష్క్రమించిన టీమిండియా, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ సెమీస్‌లో ఓడిపోయింది. అయితే ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు కోరుతున్నారు. టీమిండియాకు గాయం కారణంగా జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ దూరమయ్యారు . దీంతో వరల్డ్ కప్‌లో ఎవరిని అడించాలో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. వన్డే ప్రపంచ కప్‌లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషాన్ ను ఆడిస్తే టీమిండియాకు గెలిచే అవకాశం ఉంటుందని అన్నాడు.
ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించాలి
ఇషాన్ కిషన్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ విభాగంలో రాణించే అవకాశం ఉందన్నాడు. కేఎల్ రాహుల్, ఇసాన్ కిసాన్ ఇటీవల ఫామ్‌లో లేరని, అయితే వన్డే ప్రపంచ కప్ లోపు ఫామ్ ను సాధించి సత్తా చాటుతారని రికీ పాంటింగ్ వెల్లడించారు. రిషబ్ పంత్ లేనందున ఐదో స్థానంలో ఇసాన్ కిషన్ ను ఆడించాలన్నారు. అయితే వీరిద్దరికి వన్డే ప్రపంచ కప్‌లో చోటు దక్కుతుందని పాంటింగ్ అశాభావం వ్యక్తం చేశారు. అయితే వన్డే ప్రపంచ కప్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు ఆడించాలన్న రికి పాంటింగ్ నిర్ణయంపై చాలామంది నెటిజన్లు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.