సన్ రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ
లక్నోలోని ఆటల్ బిహరి వాజ్‌పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్(8) ఔట్ అయ్యాడు. సన్ రైజర్స్ బ్యాటర్లలో అన్నోల్ ప్రీత్ సింగ్(31) మినహా మిగతా బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. ముఖ్యంగా మార్ర్కమ్(0) డకౌట్‌తో వెనుతిరిగాడు.
చెలరేగిన కృనాల్ పాండ్యా
అటు తరువాత వచ్చిన హ్యారిబ్రూక్(3), వాషింగ్టన్ సుందర్(16), అబ్దుల్ సమద్(8), అదిల్ రషీద్(4) తక్కువ పరుగులకే పెవిలియానికి చేరారు. చివర్లో అబ్దుల్ సమద్ 9 బంతుల్లో 21 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ 120 స్కోరును దాటింది. లక్ష్య చేధనకు దిగిన లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (30) 35 పరుగులు, కృనాల్ పాండ్యా (23) 34 పరుగులతో చెలరేగారు. మిగతా బ్యాటర్లు కేల్ మేయర్స్ (13), దీపక్ హుడా (7) పరుగులు చేశారు. రొమారియో షెపర్డ్ (0) డకౌట్ అయ్యాడు. చివర్లో స్టోయినిస్ 10, నికోలస్ 11 పరుగులు చేసి విజయాన్ని అందించారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఆదిల్ రషీద్ రెండు, భువనేశ్వర్‌కుమార్, ఫారుకీ, ఉమ్రాన్‌మాలిక్ తలా ఒక వికెట్ తీశారు.