Page Loader
Chiranjeevi: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్ 
దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్

Chiranjeevi: దుబాయ్ స్టేడియంలో చిరంజీవి.. హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
07:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ అభిమానులే కాకుండా, సినీ ప్రముఖులు, క్రికెట్ లెజెండ్స్‌ కూడా ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొంత మంది నేరుగా స్టేడియానికి వెళ్లి చూస్తుండగా, మరికొందరు టీవీల ముందు కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి దుబాయ్‌ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. పెవిలియన్‌లో కూర్చొని మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న చిరంజీవి దృశ్యాలు టీవీ స్క్రీన్‌పై పలుసార్లు కనిపించాయి. అలాగే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బాలీవుడ్‌ నటుడు సన్నీడియోల్ కలిసి టీవీలో మ్యాచ్‌ వీక్షిస్తున్న ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Details

241 పరుగులకు ఆలౌటైన పాక్ జట్టు

మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 241 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోతే ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు టీమిండియా పాక్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.