Page Loader
Rohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే
రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే

Rohit Sharma: రోహిత్ శర్మపై క్రిస్ గేల్ ప్రశంసలు.. సిక్సర్లే మన ఫేవరేట్ అంటూ హిట్‌మ్యాన్ రిప్లే

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మెరుగు శతకంతో (84 బంతుల్లో 131) భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ సెంచరీతో హిట్ మ్యాన్ పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ (Chris Gayle) పేరిట ఉన్న రికార్డును నిన్నటి మ్యాచులో రోహిత్ అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్ 553 సిక్సులు సాధించగా, రోహిత్ 556 సిక్సులను బాదాడు. దీంతో రోహిత్ శర్మకు క్రిస్ గేల్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Details

థ్యాంక్స్ చెప్పిన రోహిత్

ఇందుకు రోహిత్ శర్మ రిప్లే ఇస్తూ మన జెర్సీ వెనుక 4, 5 ఉన్నప్పటికీ మన ఫేవరేట్ నెంబర్ 6 అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో సిక్సర్లే తమ ఫేవరేట్ అని రోహిత్ సరికొత్తగా చెప్పారంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాగా, రోహిత్‌, క్రిస్‌ గేల్‌లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే. మరోవైపు హిట్​మ్యాన్​తో కలసి దిగిన ఓ ఫొటోను గేల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.