Page Loader
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డ్
200 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన క్రిస్టియానో రోనాల్డో

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2023
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోర్చుగల్ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. పోర్చుగల్ తరుపున 200 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులు ఆడిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. పురుషుల ఫుట్‌బాల్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రోనాల్డ్ రికార్డుకెక్కాడు. UEFA 2024 క్వాలిఫయింగ్ కోసం ఐస్ ల్యాండ్ తో పోర్చుగల్ తరుపున ఈ మ్యాచ్ ఆడడం ద్వారా రోనాల్డ్ ఈ ఘనతను సాధించాడు. పోర్చుగల్ మంగళవారం అర్థరాత్రి ఐస్ లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్ లో రోనాల్డ్ చేసిన గోల్ ద్వారా పోర్చుగల్ 1-0 తేడాతో గెలిచింది

Details

123 గోల్స్ చేసిన క్రిస్టియానో రోనాల్డ్

మ్యాచ్ విషయానికొస్తే ఆట 89వ నిమిషంలో రోనాల్డ్ పోర్చుగల్ జట్టుకు గోల్ అందించాడు. మొత్తంమీద రోనాల్డ్‌కు ఇది 123వ అంతర్జాతీయ గోల్ కావడం విశేషం. తర్వాత 200వ మ్యాచ్ ఆడడంపై క్రిస్టియానో రొనాల్డ్ స్పందించాడు. దేశం తరుపున 200వ మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని, తన కెరీర్‌లో ఇదొక గొప్ప ఘనత అని రోనాల్డో సంతోషం వ్యక్తం చేశాడు. యూరో 2024 క్వాలిఫయింగ్ టోర్నీలో గ్రూప్-జెలో పోర్చుగల్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాన్ని సాధించింది. దీంతో గ్రూప్ లో టాపర్ గా కొనసాగుతోంది.