Australian Open 2025: సినర్‌దే విజయం.. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ కైవసం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటలీ ఆటగాడు యానిక్ సినర్ వరల్డ్ నంబర్ వన్‌గా తన స్థాయిని నిరూపించుకుంటూ వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో సినర్ 6-3, 7-6 (7-4), 6-3 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు. ఈ విజయం సినర్‌కు మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌గా నిలిచింది.
మ్యాచ్ మొదటి సెట్‌లో సినర్, జ్వెరెవ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
ఒక దశలో స్కోరు 3-3తో సమంగా ఉండగా, ఆ తర్వాత సినర్ అద్భుతంగా ఆడుతూ సెట్‌ను తన సొంతం చేసుకున్నాడు.
Details
ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు
రెండో సెట్‌లో జ్వెరెవ్ పుంజుకుంటూ 4-3 లీడ్‌లోకి వెళ్లాడు. కానీ, ఇద్దరి మధ్య పాయింట్ల పోరు కొనసాగడంతో స్కోరు 6-6తో సమమైంది.
టై బ్రేకర్‌లో జ్వెరెవ్ ఆరంభంలో ఆధిక్యంలో నిలిచినా సినర్ క్రమంగా పుంజుకొని రెండో సెట్‌ను గెలుచుకున్నాడు.
మూడో సెట్‌లో జ్వెరెవ్ ఆరంభంలో దూకుడుగా ఆడి పోటీ ఇచ్చినా తర్వాత డీలా పడిపోవడంతో సినర్ మరో సెట్‌ను సునాయాసంగా గెలిచి మ్యాచ్‌ను ముగించాడు.