Rashid Khan: భారత్‌తో పాటు ఆస్ట్రేలియా నుంచి సిటిజన్‌షిప్ ఆఫర్.. రషీద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో పాటు మరో దేశం నుంచి కూడా తనకు పౌరసత్వం ఇవ్వాలని ఆఫర్లు వచ్చాయని అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు. అయినప్పటికీ తాను మాత్రం అఫ్గాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని మరోసారి స్పష్టం చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్ సమయంలో ఓ ఉన్నతస్థాయి వ్యక్తి తనకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ నాకు భారత్‌తో పాటు ఆస్ట్రేలియా నుంచి కూడా పౌరసత్వం ఇవ్వాలని ఆఫర్లు వచ్చాయి. కానీ ఆ సమయంలో నేను స్పష్టంగా ఒకటే చెప్పాను. నా దేశం తరఫున క్రికెట్ ఆడకపోతే, మరే ఇతర దేశం కోసం కూడా ఆడనని పేర్కొన్నాడు.
వివరాలు
ఆఫ్గాన్ తరుపున క్రికెట్ అడుతా
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సమయంలో భారత క్రికెట్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి తనను కలవాలని కోరాడని తెలిపారు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారని చెప్పారు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు. మీరు భారత్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడండి. అవసరమైన పత్రాలు అందిస్తాం. ఇక్కడే జీవిస్తూ క్రికెట్ కొనసాగించండి అని ఆ అధికారి సూచించినట్టు వెల్లడించాడు. ఆ ప్రతిపాదన విన్నప్పుడు తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, ఎలా స్పందించాలో కొద్దిసేపు అర్థం కాలేదని రషీద్ చెప్పాడు. చివరికి నవ్వుతూ, 'ధన్యవాదాలు. కానీ నేను నా దేశం అఫ్గానిస్థాన్ తరఫునే క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నానని సమాధానం ఇచ్చినట్టు గుర్తు చేసుకున్నాడు.