
Yashasvi Jaiswal: రహానెతో ఘర్షణ.. కిట్‌బ్యాగ్‌ను తన్నిన యశస్వి.. ముంబై వీడటానికి కారణమిదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ క్రికెట్ స్టార్ యశస్వీ జైస్వాల్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో ముంబయి జట్టును వీడి ఇకపై గోవా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలుస్తోంది.
అతని ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఇందుకు కారణంగా ముంబయి జట్టు సారథి అజింక్య రహానె చేసిన వ్యాఖ్యలే అని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
యశస్వి జైస్వాల్ ఆటతీరుపై ముంబయి టీమ్ మేనేజ్‌మెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కెప్టెన్ రహానె, కోచ్ ఓంకార్ సాల్వి అతడి కమిట్‌మెంట్‌ను ప్రశ్నించారని సమాచారం.
అంతేగాక రహానె అసహనంతో తన కిట్‌బ్యాగ్‌ను కూడా తన్నాడని కథనాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలోనే యశస్వి అగ్రహంతో ముంబయిని వదిలేశాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Details
యశస్వీ జైస్వాల్ పై విమర్శలు
ఇటీవల బీసీసీఐ సూచనల మేరకు యశస్వి రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగాడు. జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 4, 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
ఆ మ్యాచ్‌లో ముంబయి ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో యశస్విపై విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా ముంబయి చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం యశస్విని మరింత బాధించిందని తెలుస్తోంది.
జట్టులో నాణ్యమైన యువ క్రికెటర్లను పక్కనబెట్టి, భారత జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చాం.
కానీ వారు నిబద్ధతతో ఆడలేకపోయారు. ముంబయి టీమ్‌కు అవసరమైనది కష్టపడే ఆటగాళ్లే. టీమ్ ఇండియాలో ఉండటం కాదు, టీమ్ విజయానికి శ్రమించాలంటే మనమిద్దమే లక్ష్యం కావాలని ఆయన వ్యాఖ్యానించారు.
Details
రహానే-యశస్వీ మధ్య భేదాభిప్రాయాలు!
ఇది ఒక్కటే కాదు - 2022 దులీప్ ట్రోఫీలో కూడా యశస్వి, రహానె మధ్య విభేదాలు తలెత్తినట్టు సమాచారం.
ప్రత్యర్థి ఆటగాడు రవితేజపై యశస్వి స్లెడ్జింగ్ చేయగా, కెప్టెన్ రహానె వెంటనే అతడిని మైదానం విడిచి వెళ్లాలంటూ ఆదేశించినట్టు తెలుస్తోంది.
అప్పటి నుంచే వారిద్దరి మధ్య అంతర్ద్వంద్వం మొదలై, ఇప్పుడు ఇది క్లైమాక్స్‌కు చేరినట్టుగా అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇక యశస్వి.. తన సామర్థ్యాన్ని కొత్త వేదికపై - గోవా జట్టులో చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
ముంబయి వంటి గొప్ప క్రికెట్ సంస్కృతి ఉన్న జట్టును వదిలి వెళ్లడమంటే సాధారణ విషయమే కాదు. ఈ పరిణామాలు యశస్వి కెరీర్‌పై ఎలా ప్రభావం చూపిస్తాయో వేచిచూడాలి.