IPL 2026: చెన్నై vs ముంబయి.. ధోని, రోహిత్ వస్తున్నారా? ఫ్యాన్స్ వెయిటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు. అలాగే రోహిత్ శర్మ ప్రారంభంలో కొన్ని మ్యాచుల్లో కనిపించినప్పటికీ, గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ రోజు చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కలిసి కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. దీంతో ధోని, రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడతారా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఈ అనుమానాలపై రెండు జట్ల కోచ్‌లు స్పష్టత ఇచ్చారు.
వివరాలు
ధోని పరిస్థితిపై ఆందోళన..
ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్థనె, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పందించారు. మైక్ హస్సీ మాట్లాడుతూ, "ఎంఎస్ ధోని ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు తప్పకుండా మ్యాచ్‌లు ఆడతాడు. అయితే ఈ రోజు ముంబయి జట్టుతో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడా అనే విషయంలో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. గాయం నుంచి కోలుకునే ప్రక్రియ సానుకూలంగా సాగుతోంది. అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్ సామర్థ్యాలపై మాకు ఎలాంటి సందేహం లేదు. ఇంకా అతడికి మంచి ఫిట్‌నెస్, పరుగులు తీయగల సామర్థ్యం ఉంది" అని తెలిపారు. కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు సీఎస్‌కే ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
వివరాలు
రోహిత్ పరిస్థితిపై కోచ్ ఏమన్నాడంటే..
మహేల జయవర్థనె మాట్లాడుతూ, "రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడు. దాని కోసం అతడు ఎంతో శ్రమించాడు. మెడికల్ టీమ్ నిరంతరం అతని పరిస్థితిని పరిశీలిస్తోంది. మ్యాచ్ సమయానికి అతని ఫిట్‌నెస్ ఎలా ఉంటుందో చూసి నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానంలో ఉంది. ఈ జట్టు 8 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు సాధించింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ పరిస్థితి అంతగా మెరుగ్గా లేదు. ఆ జట్టు 8 మ్యాచ్‌లలో కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఇక నుంచి ఇరుజట్లకు ప్రతి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ధోనీ, రోహిత్ శర్మ వీడియో..
MS 💛💙 RS#WhistlePodu #CSKvMI pic.twitter.com/3rWcfz6A3G
— Chennai Super Kings (@ChennaiIPL) May 1, 2026