Page Loader
ఎమ్మా రాడుకానుపై కోకో గౌఫ్ విజయం
ఎమ్మా రాడుకానుపై విజయం సాధించిన కోకో గౌఫ్

ఎమ్మా రాడుకానుపై కోకో గౌఫ్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2023
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 ఆస్ట్రేలియా ఓపెన్లో టెన్నిస్ స్టార్ కోకో గౌఫ్ అద్భుతంగా ఆడింది. ఎమ్మా రాడుకాను కోకో గౌఫ్ ఓడించింది. మ్యాచ్ టైబ్రేకర్‌కు ముందు గౌఫ్ తొలి సెట్‌లో 6-3తేడాతో గౌఫ్ ముందుకెళ్లింది. అనంతరం రాడుకాను 7-6తో అధిగమించి కోకో గౌఫ్ 3వ రౌండ్‌కు చేరుకుంది. రాడుకాను 2021 యుఎస్ ఓపెన్ గెలిచినప్పటి నుండి, ఏ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లలో రెండవ రౌండ్‌ దాటకపోవడం గమనార్హం. రాడుకానుపై గౌఫ్ 1-0 ఆధిక్యంలో ఉంది. రాడుకానుతో పోలిస్తే గౌఫ్ మూడు ఏస్‌లు చేసింది. గౌఫ్ మొదటి సర్వ్‌లో 66శాతం విజయం సాధించింది. ఆమె 3/7 బ్రేక్ పాయింట్లను మార్చగా.. అందులో ఒక టై బ్రేక్‌ను గౌఫ్ గెలుచుకుంది.

కోకో గౌఫ్

మహిళల సింగల్స్ 2వ రౌండ్‌లో ఫలితాలు

మహిళల సింగల్స్ 2వ రౌండ్లో ఇతర ఫలితాలు ఇలా ఉన్నాయి. ‌ 7-6, 6-4తో స్లోన్ స్టీఫెన్స్‌ను అనస్తాసియా పొటాపోవా ఓడించింది. క్రిస్టినా బుక్సా 2-6, 7-6, 6-4తో కెనడాకు చెందిన బియాంకా ఆండ్రీస్కును మట్టికరిపించింది. 27వ సీడ్ ఇరినా-కెమెలియా బేగు 3-6, 7-6, 6-2తో ఎలిజబెత్ మాండ్లిక్‌పై విజయం సాధించింది. 6-4, 6-1తో క్లారా బురెల్‌పై 20వ సీడ్ బార్బోరా క్రెజ్‌సికోవా విజయం సాధించింది.