Page Loader
రికార్డు బద్దలు కొట్టిన కోకో గౌఫ్
టైటిళ్లను ముద్దాడుతున్న కోకో గౌఫ్

రికార్డు బద్దలు కొట్టిన కోకో గౌఫ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2023
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ASB క్లాసిక్ టైటిల్‌ను అమెరికా స్టార్ కోకో గౌఫ్ సాధించింది. ఫైనల్లో 6-1, 6-1 తేడాతో స్పానిస్ క్వాలిఫైయర్ రెబికా మసరోవాను ఓడించి రికార్డు బద్దలు కొట్టింది. టోర్నమెంట్‌లో ఒక్క సెట్ కూడా వదలకుండా గౌఫ్ విజయదుంధుబి మోగించింది. 2021లో పార్మా ఓపెన్ గెలిచిన తర్వాత.. ఆమె మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మసరోవా మూడు ఏస్‌లతో పోలిస్తే.. గౌఫ్ మొత్తం ఐదు ఏస్‌లు సాధించింది. గౌఫ్ మూడు డబుల్ ఫాల్ట్‌లను నమోదు చేయగా, ఆమె ప్రత్యర్థి రెండుసార్లు మాత్రమే నమోదు చేయడం గమనార్హం.

కోకో గౌఫ్

మూడు కెరీర్ టైటిళ్లు కైవసం

2019 తర్వాత తొలి హార్డ్ కోర్ట్ టైటిల్ సాధించడంపై హర్షం వ్యక్తం చేసింది. నిజంగా చెప్పాలంటే ఇది తనకు గొప్ప గౌరవమని, తాను కష్టపడి విజయం సాధించినందుకు గర్వంగా ఉందని కోకో గౌఫ్ తెలియజేశారు. ఆక్లాండ్‌లో టాప్ సీడ్‌గా ఆడుతున్న గౌఫ్ మూడో రౌండ్‌లో 6-4, 6-1తో టట్జానా మారియాను ఓడించింది. ఆ తర్వాత 6-4, 6-4తో సోఫియా కెనిన్‌పై విజయం సాధించింది. క్వార్టర్-ఫైనల్ లో 6-3, 6-2, సెమీ-ఫైనల్‌లో 6-0, 6-2తో జులిన్‌ను ఓడించింది. ఫైనల్‌లో మసరోవాపై 6-1, 6-1 తేడాతో గెలుపొంది గౌఫ్ తన కెరీర్‌లో మూడో టైటిల్‌ను అందుకోవడం విశేషం.