Page Loader
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. స్వియాటెక్‌తో తలపడనున్న కోకో గౌఫ్
రీమ్యాచులో తలపడనున్న స్వియాటెక్, కోకో గౌఫ్

నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్.. స్వియాటెక్‌తో తలపడనున్న కోకో గౌఫ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెంచ్ ఓపెన్ 2023 సెమీఫైనల్ స్థానం కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుపొందింది.ప్రస్తుతం ఆమె కోకో గౌఫ్‌తో తలపడనుంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ కి ఓన్స్ జబీర్, బీట్రిజ్ హద్దాద్ అర్హత సాధించారు. ఈ ఇద్దరూ తొలిసారిగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న తొలి ఆఫ్రికన్ మహిళగా జబీర్ నిలిచింది. పురుషుల విభాగంలో అలెగ్జాండర్ జ్వెరెవ్ వరుసగా మూడోసారి సెమీఫైనల్ కి చేరుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. హోల్గర్ రూన్ గతేడాది పురుషుల సింగిల్స్ లో రన్నరప్ గా నిలిచిన కాస్పర్ రూడ్ తో పోటీపడనున్నారు.

Details

ఫ్రెంచ్ ఓపెన్ షెడ్యూల్ వివరాలు

బీట్రిజ్ హద్దాద్ మైయా (బ్రెజిల్) v 7-ఆన్స్ జబీర్ (ట్యునీషియా) ఇగా స్వియాటెక్ (పోలాండ్) v 6-కోకో గాఫ్ (U.S.) అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) v టోమస్ మార్టిన్ ఎట్చెవెరీ (అర్జెంటీనా) హోల్గర్ రూన్ (డెన్మార్క్) v 4-కాస్పర్ రూడ్ (నార్వే) అన్ని మ్యాచ్‌లను Sony TEN, SONY LIVలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.