
Team India: ఆసియా కప్ జట్టు ఎంపికలో గందరగోళం.. సెలెక్టర్లకు పెద్ద సవాల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఈసారి సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ పూర్తిగా టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. సెప్టెంబర్ 9న అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మధ్య పోరుతో టోర్నీ ఆరంభం కానుంది. టీమిండియా తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ (అజిత్ అగార్కర్ నేతృత్వంలో) ఆగస్టు 19 లేదా 20న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్పోర్ట్స్ సైన్స్ బృందం పంపే ఆటగాళ్ల వైద్య నివేదికల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇటీవలే హెర్నియా సర్జరీ చేయించుకున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తొలగనుండగా, ప్రస్తుతం అతడు బెంగళూరులో నెట్స్‌లో సాధన చేస్తున్నాడు.
details
వీరి ఎంపిక ఖాయం
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఎంపిక దాదాపు ఖరారైనట్లే. ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన చేసి, ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 జట్టులో స్థానం కల్పించడంపై సెలెక్టర్లు తలపట్టుకుంటున్నారు. ఇక యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లను ఏ స్థానంలో ఆడించాలన్నదీ క్లిష్ట సమస్యే.
Details
కేఎల్ రాహుల్ కి ఛాన్స్ దక్కకపోవచ్చు
కేఎల్ రాహుల్‌కు ఈ సారి ఆసియా కప్ జట్టులో స్థానం దక్కకపోవచ్చు. సంజు శాంసన్ తర్వాత రెండో వికెట్ కీపర్ కోసం జితేశ్ శర్మ - ధ్రువ్ జురేల్ మధ్య గట్టి పోటీ ఉంది. వీరిద్దరిలో ఒకరినే ఎంపిక చేయాలి. జితేశ్ శర్మ ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన చేశాడు.
Details
పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్
ఇంగ్లాండ్ టూర్‌లో గాయపడ్డ నితీశ్ కుమార్ రెడ్డి ఈ సారి ఎంపిక కానే అవకాశం లేదు. శివమ్ దూబే స్క్వాడ్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువ. స్పిన్ ఆల్‌రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఎంపిక దాదాపు ఖాయం. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఎంపిక లాంఛనమే. గత ఐపీఎల్‌లో 25 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలో ఒకరే జట్టులోకి వస్తారు. ఈ నిర్ణయం కూడా సెలెక్టర్లకు సులభం కానిదే అని చెప్పొచ్చు.