
Cricketers Arrest: దక్షిణాఫ్రికా క్రికెటర్లపై అవినీతి ఆరోపణలు.. ముగ్గురు క్రికెటర్లు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చిన 2015-16 రామ్‌స్లామ్ టీ20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం మరోసారి వార్తల్లో నిలిచింది.
మాజీ నంబర్ 1 వన్డే బౌలర్ లోన్వాబో త్సోత్సోబే, థమీ సోలెకిలే, ఎథీ మ్భలాటి ఈ కేసులో ఇటీవల అరెస్టయ్యారు. ఈ క్రికెటర్లపై 2004 అవినీతి నిరోధక చట్టం కింద ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
ఆ చట్టం ప్రకారం క్రీడల పవిత్రతను దెబ్బతీసే లంచాలు ఇవ్వడం లేదా తీసుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
2016-2017 కాలంలో టీ20 టోర్నమెంట్ ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు క్రికెట్ సౌతాఫ్రికా (CSA) మొత్తం ఏడు ఆటగాళ్లపై నిషేధం విధించింది.
Details
మూడు మ్యాచుల్లో గులాం జోడి ఫిక్స్ంగ్
వారిలో గులాం బోడి, జీన్ సైమ్స్, పుమి మట్షిక్వే, లోన్వాబో త్సోత్సోబే, థమీ సోలెకిలే, ఎథీ మ్భలాటి, అల్విరో పెటర్సన్ ఉన్నారు.
ఈ నిషేధాలు రెండేళ్ల నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటాయి. 2000లో హన్సీ క్రోన్యే కేసు తర్వాత, దక్షిణాఫ్రికాలో తీసుకొచ్చిన అవినీతి నిరోధక చట్టాన్ని ఇప్పుడు క్రియాశీలంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి.
అత్యున్నత క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 'హాక్స్' ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకుంది.
గులాం బోడి భారత బుక్‌మేకర్ల సాయంతో మూడు మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది.