ఒలింపిక్స్ లో క్రికెట్: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్ నుండి మొదలు
ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్ కి ఉన్న ప్రాధాన్యతే వేరు. దాదాపు అన్ని దేశాలు ఈ గేమ్స్ లో పాల్గొంటాయి. అయితే తాజాగా ఒలంపిక్ గేమ్స్ లో కొత్తగా ఐదు ఆటలను చేర్చారు. అందులో క్రికెట్ కూడా ఉంది. 1900ల సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన ఒలంపిక్ గేమ్స్ లో మొదటిసారిగా క్రికెట్ ఆటను నిర్వహించారు. కానీ ఆ తర్వాత క్రికెట్ ను ఒలింపిక్ గేమ్స్ నుండి తొలగించారు. తాజాగా అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(IOC) ఎగ్జిక్యూటివ్ బోర్డు.. క్రికెట్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోజ్, స్క్వాష్ మొదలగు ఆటలను ఒలంపిక్ గేమ్స్ లో చేరుస్తూ అక్టోబర్ 13వ తేదీన ఆమోదం తెలియజేసింది.
టీ20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు
దీంతో 2028 లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్ గేమ్స్ లో ఈ ఐదు ఆటలు ఉండనున్నాయి. క్రికెట్ లో చూసుకుంటే 2028 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్ గేమ్స్ లో పురుషుల, మహిళల క్రికెట్ పోటీలను నిర్వహించబోతున్నారు. అయితే క్రికెట్ లో ఉన్న మూడు ఫార్మాట్లలోటీ20 ఫార్మాట్ లో పోటీలను నిర్వహించనున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒలంపిక్ గేమ్స్ లో క్రికెట్ మ్యాచులు ఆడే అవకాశం కేవలం 6జట్లకు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. కాకపోతే 2028 సంవత్సరం వరకల్లా మరిన్ని జట్లు చేరే అవకాశం ఉందని సమాచారం.