Team India: రెండు టీ20 వరల్డ్ కప్‌లతో క్రికెట్ సందడి.. 2026లో టీమిండియా ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
2025 సంవత్సరం టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో (వైట్ బాల్) ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలు గెలిచి భారత జట్లు సత్తా చాటాయి. అయితే, టెస్టుల్లో (రెడ్ బాల్) మాత్రం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొని అభిమానులను నిరాశపరిచాయి. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టెస్టుల్లో తడబడ్డా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం టీమిండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం టీమిండియాకు మరింత బిజీగా ఉండనుంది. పురుషుల, మహిళల క్రికెట్‌లో వరుసగా మెగా టోర్నీలు, కీలక సిరీస్‌లతో క్రికెట్ క్యాలెండర్ పూర్తిగా నిండిపోయింది.
Details
2026లో భారత్ పురుషుల క్రికెట్ షెడ్యూల్
జనవరి 15 - ఫిబ్రవరి 6 (అండర్-19 వరల్డ్ కప్) నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ **గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, యుఎస్ఏలతో పోటీపడనుంది. జనవరి (న్యూజిలాండ్ భారత్ పర్యటన) టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించి 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి (టీ20 వరల్డ్ కప్) 2016 తర్వాత తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్-ఏలో భారత్ పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యుఎస్ఏలతో** తలపడనుంది.
Details
మార్చి - మే (ఐపీఎల్ 2026)
ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి మొదలుకానుంది. జూన్ (ఆఫ్ఘనిస్తాన్ భారత్ పర్యటన) ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించి ఒక టెస్ట్, 3 వన్డేలు ఆడనుంది. జులై (ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటన) ఇంగ్లండ్ గడ్డపై భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఆగస్టు (శ్రీలంక పర్యటన) శ్రీలంకలో భారత్ 2 టెస్టులు ఆడనుంది. ఇవి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగం. ఆగస్టు / సెప్టెంబర్ దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు ఆడే అవకాశం ఉంది.
Details
సెప్టెంబర్ - అక్టోబర్ (వెస్టిండీస్ భారత్ పర్యటన)
వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించి 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. అక్టోబర్ తర్వాత న్యూజిలాండ్ పర్యటన (అన్ని ఫార్మాట్లు), డిసెంబర్‌లో శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ షెడ్యూల్‌లో ఉన్నాయి.
Details
భారత మహిళల క్రికెట్ షెడ్యూల్
2026లో మహిళల క్రికెట్‌లోనూ కీలక టోర్నీలు, చారిత్రాత్మక మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జనవరి 9 - ఫిబ్రవరి 5 (డబ్ల్యూపీఎల్) మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఈసారి జనవరిలోనే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి - మార్చి (ఆస్ట్రేలియా పర్యటన) ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు 3 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. మే-జూన్ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ జరుగుతుంది. జూన్ 12 - జులై 5(మహిళల టీ20 వరల్డ్ కప్) ఇంగ్లండ్ వేదికగా జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో ఒకే గ్రూప్‌లో పోటీపడనుంది.
Details
జులై
క్రికెట్ మక్కాగా పేరొందిన లండన్ లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు మహిళల ఆసియా కప్ జరగనుంది.