
Ban On Cricket: ఆ నగరంలో క్రికెట్ నిషేధం.. బ్యాట్ కనిపిస్తే భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రతి దేశంలోనూ ఆదరణ పెరుగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడతారు.
క్రికెట్ మరింత ఆదరణ పొందుతున్న వేళ.. యూరప్ దేశాల్లోని ఓ నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో క్రికెట్ ను నిషేధిస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక వేళ ఎవరైనా ఈ కట్టుబాటును ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఈ నిషేధానికి కారణం నగర మున్సిపాలిటీ ఖజానాలో క్రికెట్ పిచ్ తయారీకి లేదా స్టేడియం నిర్మాణానికి సరిపడా నిధులు లేకపోవడమే అని తెలిసింది.
Details
ఇటలీలోని మొన్‌ఫాల్కొనే లో కఠిన నిబంధన
అంతేకాకుండా బంతి తగలడం వల్ల ప్రమాదం కలగొద్దనే ఉద్దేశంతో నగర మేయర్ అన్నా మరియా సిసింట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మేయర్ సిసింట్ స్పందిస్తూ నగరంలో ఎవ్వరూ క్రికెట్ ఆడకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ఆ దేశాలను నిబంధనలు ఉల్లంఘించి క్రికెట్ ఆడితే, 100 యూరోలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 9,000) జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
ఇటలీలోని మొన్‌ఫాల్కొనే నగరం ఈ నిబంధనను విధించారు.
ఈ నిర్ణయంపై మొన్‌ఫాల్కొనే ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.