Mohammed Shami: ఓటరు జాబితా సవరణలో 'సర్' విచారణకు హాజరైన క్రికెటర్ షమీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కూడా తాకీదు అందింది. నోటీసుల మేరకు ఆయన కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై, కోరిన సంబంధిత పత్రాలను సమర్పించారు. ఎస్‌ఐఆర్ దరఖాస్తులో మహ్మద్ షమీ ఇచ్చిన వివరాల్లో కొన్ని చోట్ల వ్యత్యాసాలు కనిపించడంతో విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చామని ఈసీకి చెందిన సీనియర్ అధికారులు తెలిపారు.
Details
కోల్‌కతాలో నివాసముంటున్న మహ్మద్ షమీ
ఇదివరకే ఒకసారి నోటీసులు జారీ చేసినప్పటికీ, అప్పట్లో క్రికెట్ మ్యాచ్ కారణంగా హాజరు కాలేకపోయిన నేపథ్యంలో ఆయనకు మరో అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. మూలంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ ప్రస్తుతం క్రికెట్ కారణంగా కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నగరంలోని 93వ వార్డులో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈ వార్డు రాస్‌బిహారీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని అధికారులు వివరించారు.