LOADING...
CSK: విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు
విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు

CSK: విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలో జరగనున్న సీఎస్‌కే- లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియంలో రాజకీయ ప్రదర్శనలు చేయొద్దని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ విజ్ఞప్తి చేసింది. ఇదే రోజు టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీ ఈ ప్రకటన విడుదల చేసింది. నటుడిగా గుర్తింపు పొందిన సి. జోసఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో తమిళనాడుకు తొలి నాన్-ద్రావిడియన్ సీఎం లభించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న రోజే చెన్నైలో సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ మ్యాచ్ కూడా ఉండటంతో అభిమానుల స్పందనపై ఆసక్తి నెలకొంది.ఆ

వివరాలు

బ్యానర్లు, జెండాలు తీసుకురావొద్దు..

ఈ నేపథ్యంలో సీఎస్‌కే సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. చెపాక్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, ఎలాంటి రాజకీయ పార్టీలు లేదా నాయకులకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్ తీసుకురావొద్దని అభిమానులను కోరింది. అందరూ కేవలం క్రికెట్‌ను ఆస్వాదించాలని, ఆట స్ఫూర్తిని నిలబెట్టాలని ఫ్రాంచైజీ విజ్ఞప్తి చేసింది. "క్రికెట్‌ను, ఆట స్ఫూర్తిని కలిసి సెలబ్రేట్ చేద్దాం. మా సూపర్ ఫ్యాన్స్‌కు ప్రేమతో ఒక విజ్ఞప్తి.. రాజకీయ పార్టీలు లేదా వ్యక్తులకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్ తీసుకురావద్దు. పూర్తి 'యెల్లోవ్' స్పిరిట్‌తో మ్యాచ్‌ను ఎంజాయ్ చేయండి" అంటూ సీఎస్‌కే తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది.

వివరాలు

మ్యాచ్‌పైనే అందరి దృష్టి...

తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్టేడియంలో విజయ్‌కు మద్దతుగా సంబరాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న సీఎస్‌కే, మ్యాచ్‌పైనే అందరి దృష్టి ఉండాలని కోరుకుంటోంది. మరోవైపు సీఎస్‌కే అభిమానుల 'విసిల్ పోడు' క్యాంపెయిన్ ఇప్పటికే భారీ చర్చకు దారితీసింది. టీవీకే పార్టీ గుర్తింపులో కూడా విజిల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతున్న వేళ అభిమానులు రాజకీయాలకంటే క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆట స్ఫూర్తిని నిలబెట్టాలని సీఎస్‌కే మరోసారి స్పష్టం చేసింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement