MS Dhoni: ధోనీ రిటైర్మెంట్ గురించి సీఎస్కే సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కి సన్నాహాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై మిలియన్ డాలర్ల ప్రశ్నగా నెలకొంది.
అయితే ఈ సీజన్‌లో ధోనీ ఆడనున్నాడనే విషయం స్పష్టమైంది. ఈ సీజన్ కోసం అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కే ఫ్రాంఛైజీ ఎంపిక చేసింది.
తాజాగా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుతో యూట్యూబ్ ఛానెల్ ప్రొవోక్డ్‌లో సంభాషణలో కాశీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాయుడు, ధోనీ ఎప్పుడు రిటైర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడని కాశీని అడిగాడు. దీనిపై కాశీ విశ్వనాథన్ సమాధానం ఇచ్చారు.
Details
ధోని తన చివరి మ్యాచ్‌ను చెన్నైలోనే : కాశీ
ధోనీ ఈ విషయాలను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోడని, ఈ విషయం రాయుడికి కూడా తెలుసని చెప్పారు.
ఇలాంటి విషయాలు చివరి క్షణంలో బయటికి వస్తాయని, ధోనీ తన చివరి మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడతాడని తాను నమ్ముతున్నానని కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.
ధోనీ సాధ్యమైనంత కాలం ఆడాలని తాము ఆశిస్తున్నామని, ఎంఎస్ ధోనీ కావాలనుకున్నంత కాలం ఆడేందుకు సీఎస్కే ఎప్పటికీ తలుపులు తెరిచే ఉంటుందన్నారు.
ధోనీకి ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.