LOADING...
IPL 2026 Player Loan Rules : క్రికెట్‌లో ప్లేయర్ లోన్..చెన్నై తరపున ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్
క్రికెట్‌లో ప్లేయర్ లోన్..చెన్నై తరపున ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్

IPL 2026 Player Loan Rules : క్రికెట్‌లో ప్లేయర్ లోన్..చెన్నై తరపున ఆడనున్న ఆర్సీబీ ప్లేయర్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
06:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు పెద్ద సవాల్‌గా మారాయి. తాజాగా ఈ సమస్య డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును కూడా తాకింది. జట్టు కీలక ఓపెనర్ ఆయుష్ మ్హాత్రే గాయపడటంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 201 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న అతని గైర్హాజరీ సీఎస్కేకు పెద్ద లోటుగా మారింది. ఇప్పుడు అతని స్థానాన్ని ఎలా భర్తీ చేయాలనే విషయంపై చర్చ జరుగుతోంది.

వివరాలు

ఆటగాడ్ని అప్పుగా తీసుకున్న జట్టు..

ఈ పరిస్థితిలో టీమిండియా అనుభవజ్ఞుడు రవిచంద్రన్ అశ్విన్ ఒక ఆసక్తికరమైన సూచన చేశాడు. అదే "ప్లేయర్ లోన్" విధానం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో అవకాశాలు దక్కని వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుందును లోన్ మీద సీఎస్కే తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. అయితే ఐపీఎల్‌లో నిజంగా ఒక జట్టు ఆటగాడిని మరో జట్టు అప్పుగా తీసుకోవచ్చా? దానికి సంబంధించిన నియమాలు ఏమిటి? ఇప్పుడు వాటిని వివరంగా తెలుసుకుందాం.

వివరాలు

ప్లేయర్ లోన్ అంటే ఏమిటి?

ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ విధానం మొదటగా 2018లో ప్రవేశపెట్టబడింది. అప్పట్లో ఇది కేవలం అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని ఆటగాళ్లు) మాత్రమే వర్తించేది. కానీ 2019 నుంచి ఈ నియమాన్ని క్యాప్డ్ ప్లేయర్లకూ విస్తరించారు. ఒక జట్టులో అవకాశాలు రాని ఆటగాళ్లను అవసరమున్న మరో జట్టుకు తాత్కాలికంగా పంపించడం ఈ విధానం లక్ష్యం. ప్రస్తుతం ఆయుష్ మ్హాత్రే స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్న సీఎస్కేకు, ఆర్‌సీబీ బెంచ్‌పై ఉన్న అభిజ్ఞాన్ కుందు సరైన ఎంపిక కావచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

వివరాలు

లోన్ విధానానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలివే

మూడు వర్గాల అంగీకారం అవసరం: ఆటగాడి అసలు జట్టు (RCB), అతన్ని తీసుకోవాలనుకుంటున్న జట్టు (CSK), అలాగే ఆ ఆటగాడు — ఈ ముగ్గురూ ఒప్పుకుంటేనే లోన్ ఒప్పందం అమల్లోకి వస్తుంది. మ్యాచ్‌ల పరిమితి: లోన్ ఇవ్వబోయే ఆటగాడు తన అసలు జట్టు తరఫున ఆ సీజన్‌లో గరిష్టంగా 2మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఉండాలి. అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే లోన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఒకే సీజన్‌కు పరిమితం: లోన్‌పై వెళ్లిన ఆటగాడు సీజన్ ముగిసే వరకు కొత్త జట్టులో ఉంటాడు. తర్వాతి సీజన్‌కు మళ్లీ తన అసలు జట్టుకే చేరాలి. మాతృ జట్టుపై ఆడలేడు: ఒకవేళ అభిజ్ఞాన్ కుందు సీఎస్కేకు మారితే, సీఎస్కే vs ఆర్‌సీబీ మ్యాచ్‌లో అతను పాల్గొనలేడు.

Advertisement