తదుపరి వార్తా కథనం

Sumeeth Reddy: కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ రజత పతక విజేత షట్లర్ 'సుమీత్ రెడ్డి' ఆటకు వీడ్కోలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 25, 2025
10:35 am
ఈ వార్తాకథనం ఏంటి
2022 కామన్వెల్త్ క్రీడల మిక్స్‌డ్ టీమ్ రజత పతక విజేత,భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ఆటగాడు సుమీత్ రెడ్డి తన ఆటకు వీడ్కోలు పలికాడు.
పూర్తిగా శిక్షణపై దృష్టిసారించేందుకు,33ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ కెరీర్‌కు సుమీత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
పురుషుల డబుల్స్‌లో మను అత్రితో జతకట్టి బరిలో దిగిన సుమీత్,ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 17వస్థానం సంపాదించాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో తన భార్య సిక్కిరెడ్డితో కలిసి పోటీ చేశాడు.2016 దక్షిణాసియా క్రీడల్లో సుమీత్-మను జోడీ స్వర్ణ పతకం సాధించగా,రియో ఒలింపిక్స్‌లోనూ పాల్గొంది.
2014,2018 ఆసియా క్రీడల్లో సైతం సుమీత్ తన జోడీతో పోటీకి దిగాడు.2015 మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి,2016 కెనడా ఓపెన్ టోర్నీల్లో విజయం సాధించిన సుమీత్ జంట,2015 యుఎస్ ఓపెన్, డచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది.
మీరు పూర్తి చేశారు