రష్యా ఆటగాళ్లను అనుమతించడంపై డారియా కసత్కినా హర్షం
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, రాబోయే ఎడిషన్‌లో రష్యన్, బెలారసియన్ ఆటగాళ్లను అనుమతించినందుకు డారియా కసత్కినా ఆనందం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధం కారణంగా గతేడాది గ్రాస్ కోర్ట్ టోర్నమెంట్‌లో ఆమె, ఇతర రష్యన్ క్రీడాకారులు పాల్గొనలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గత ఏడాది రెండు దేశాల ఆటగాళ్లను నిషేధించింది. అయితే మార్చిలో వారిని తటస్థ అథ్లెట్లుగా అంగీకరిస్తామని తెలిపింది. గతేడాది ప్రారంభంలో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకా, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఎలెనా రిబాకినాను ఓడించి గ్రాండ్‌స్లామ్‌లో మొదటి తటస్థ ఛాంపియన్‌గా అవతరించింది.
ఉక్రెయిన్‌కు చెందిన లెసియా ట్సురెంకోను ఓడించిన కసత్కినా
ఆరంట్క్సా సాంచెజ్ స్టేడియంలో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లెసియా ట్సురెంకోను 6-4, 6-2 తేడాతో కసత్కినా ఓడించింది. అనంతరం మీడియాతో మాట్లాడింది. గతేడాది వింబుల్డన్ ను మిస్ అయినందుకు తాను నిజంగా బాధపడ్డానని, మళ్లీ తాము ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, కసత్కినా చెప్పారు. ఇటీవల, ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్విటోలినా మాడ్రిడ్ ఓపెన్‌లో మొదటి రౌండ్ మ్యాచ్ తర్వాత అలియాక్సాండ్రా సస్నోవిచ్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. బాధకరమైన విషయం ఏమిటంటే యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందని, ఉక్రెయిన్ నుండి వచ్చిన ఆటగాళ్ళు కరచాలనం చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కసత్కినా తెలియజేశారు.