Page Loader
చార్లెస్టన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఒన్స్ జబీర్
బెలిండా బెన్సిక్‌ను చిత్తు చేసిన జబీర్

చార్లెస్టన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఒన్స్ జబీర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

2023 చార్లెస్‌టన్ ఓపెన్‌లో ఆదివారం ఢిపెండింగ్ ఛాంపియన్ బెలిండా బెన్సిక్, ఒన్స్ జబీర్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో బెలిండా బెన్సిక్‌ను 7-6(6), 6-4 తేడాతో ఒన్స్ జబీర్ చిత్తు చేసింది. 2023 సీజన్‌లో తన మొదటి టైటిల్‌ను ఒన్స్ జబీర్ గెలుచుకొని సత్తా చాటింది. 2022 చార్లెస్టన్ ఓపెన్ ఫైనల్‌లో జబీర్‌పై 6-1, 5-7, 6-4 తేడాతో బెలిండా బెన్సిక్ గెలుపొందిన విషయం తెలిసిందే.

జబీర్

ఈ ఏడాది సత్తా చాటుతున్న జబీర్

2020 సీజన్ ప్రారంభం నుండి జబీర్ 37 విజయాలను సాధించింది. బెన్సిక్‌తో పోలిస్తే జబీర్ ఎనిమిది ఏస్‌లు సాధించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తలా నాలుగు డబుల్ ఫాల్ట్‌లు సాధించడం గమనార్హం. జబీర్ మొదటి సర్వ్‌లో 74శాతం విజయం సాధించగా, రెండోసారి 54శాతం విజయం సాధించాడు. ఆమె 4/9 బ్రేక్ పాయింట్లను మార్చింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ పరంగా, జబీర్ బెన్సిక్‌పై 3-2 ఆధిక్యంలో ఉంది.