Novak Djokovic: టెన్నిస్‌లో జకోవిచ్ ప్రపంచ రికార్డు
ప్రపంచ టెన్నిస్‌లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ పురుషుల ర్యాకింగ్స్‌లో ఏ ప్లేయర్ కు సాధ్యం కాని రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ప్రపంచ టెన్నిస్ లో 378 వారాల పాటు నంబర్ వన్ ర్యాంకర్‌గా నిలిచి జొకొవిచ్ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు. అసోసియేషన్ ఆప్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్ లో జొకొవిచ్ 6980 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్ స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉంది. గ్రాఫ్ 377 వారాలు నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన విషయం తెలిసిందే.
నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్నందుకు గర్వంగా ఉంది
అటు పురుషుల విభాగంలో గానీ, ఇటు మహిళల విభాగంలోని ఇటు పురుషుల విభాగంలోని గానీ అత్యధిక వారాలు నంబర్ వన్ గా నిలిచిన ప్లేయర్ గా రికార్డును సాధించాడు. జొకోవిచ్ జూలై 2014, నవంబర్ 2016 మధ్య వరుసగా 122 వారాల పాటు అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకుముందు రోజర్ ఫెదరర్ (237 వారాలు), జిమ్మీ కానర్స్ (160), ఇవాన్ లెండిల్ (157) అతని కంటే ముందు స్థానంలో ఉన్నారు. నంబర్ వన్ ర్యాంకర్ గా ఉంటానని తాను కలనైనా అనుకోలేదని, ప్రస్తుతం తాను శారీరకంగా,మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు జోకోవిచ్ ప్రకటించాడు.