NZ vs SL: హాఫ్ సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఐదో రోజు హాఫ్ సెంచరీతో డారిల్ మిచెల్ రాణించి సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్ లో 193 బంతుల్లో 102 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 81 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్కోరు 90/3తో క్రీజులో ఉనప్పుడు వచ్చిన డారిన్ మిచెల్ దూకుడుగా బ్యాటింగ్ అడుతూ స్కోరును పరిగెత్తించాడు. కేన్ విలియమ్సన్(121), డారిన్ మిచెల్ కలిసి నాలుగో వికెట్‌కు 142 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
మరుపురాని విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్
మిచెల్ 17 టెస్టుల్లో ఐదు సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలతో 1,299 పరుగులు చేశాడు. టెస్టుల్లో 1,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు వేగంగా చేసిన కివీ బ్యాటర్లలో ఐదో ప్లేయర్‌గా మిచిల్ నిలిచాడు. 285 టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆడిన కివీస్.. ఆఖరి బంతికి విక్టరీని నమోదు చేసింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ 8 పరుగులు చేయాల్సి ఉండగా.. కేన్ తన పోరాట స్పూర్తిని ప్రదర్శించాడు తొలుత శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 355, రెండో ఇన్నింగ్స్‌లో 302 రన్స్ చేసింది. అయితే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 373 చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 285 రన్స్ చేసి మరుపురాని విజయాన్ని అందుకుంది.