Page Loader
WTC Final: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తేదీలు ప్రకటించిన ఐసీసీ
2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తేదీలు ప్రకటించిన ఐసీసీ

WTC Final: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తేదీలు ప్రకటించిన ఐసీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2024
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) 2023-25 ఫైనల్‌ తేదీని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. లండన్‌లోని ప్రసిద్ధ లార్డ్స్‌ మైదానంలో జూన్ 11 నుండి 15 వరకు ఈ ఫైనల్‌ జరుగుతుంది, జూన్ 16 తేదీ రిజర్వ్‌ డేగా ఉంటుందని ఐసీసీ తెలిపింది. లార్డ్స్‌లో WTC ఫైనల్‌ నిర్వహించడం ఇది మొదటిసారి. మొదటి ఎడిషన్‌ (2021) సౌత్‌హాంప్టన్‌లో, రెండవ ఎడిషన్‌ (2023) ఓవల్‌ వేదికగా జరిగాయి. ఈ రెండూ లో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. 2021లో ఆస్ట్రేలియా, 2023లో న్యూజిలాండ్‌ ఛాంపియన్స్‌గా నిలిచారు. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా అగ్రస్థానంలో ఉంది, ఆస్ట్రేలియా రెండో స్థానంలో, న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది.

వివరాలు 

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్‌

పాకిస్థాన్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ నాలుగో స్థానానికి చేరింది. ఈ సారి కూడా భారత్‌ ఫైనల్‌కు చేరే అవకాశముంది. కొన్ని నెలలుగా టెస్టు క్రికెట్‌ ఆడని టీమ్‌ఇండియా త్వరలో వరుస సిరీస్‌ల్లో తలపడనుంది. సెప్టెంబరు 19 నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు (బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ) జరుగుతాయి.