డేవిడ్ డి గియా vs ఆండ్రీ ఒనానా.. ఈ ఇద్దరు రికార్డులివే..!
స్పానిష్ గోల్ కీపర్ డేవిడ్ డి గియా మాంచెస్టర్ యునైటెడ్ నుండి వైదొలిగితున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 12 సంవత్సరాల పాటు మాంచెస్టర్ యూనైటెడ్ సేవలందించిన అతడు ఒనానా యూనైటెడ్ తరుపున గోల్ కీపర్‌గా బాధ్యతలను చేపట్టనున్నాడు. మ్యాన్ యునైటెడ్‌తో డి గియా ఒప్పందం జూన్ చివరి నాటికి ముగిసింది. ప్రీమియర్ లీగ్ 2022-23 సీజన్‌లో, డి గియా 38 ప్రదర్శనలు చేశారు. అతను 101 గోల్స్‌ను సేవ్ చేశాడు. అతను 1,371 పాస్‌లు సాధించాడు. అదే విధంగా ఒక పెనాల్టీని సేవ్ చేశాడు. UEFA యూరోపా లీగ్‌లో క్వార్టర్-ఫైనల్ దశలో మాంచెస్టర్ యునైటెడ్ నిష్క్రమించింది. డి గియా గత సీజన్‌లో యూరోపా లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడాడు.
సీరీ A 2022-23 సీజన్‌లో 25 ప్రదర్శనలు చేసిన ఒనానా
సీరీ A 2022-23 సీజన్‌లో ఒనానా 25 ప్రదర్శనలు చేశాడు. ఒనానా 912 ప్రయత్నాలలో 722 పాస్‌లను సాధించాడు. అతను 14 క్లియరెన్స్‌లతో, 62 సేవ్‌లను సాధించాడు. ముఖ్యంగా బాక్స్ లోపల నుండి 39 సేవ్ లను చేయడం విశేషం. అదే విధంగా ఒనానా రెండు పెనాల్టీలను కాపాడాడు. ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌లో మాంచెస్టర్ సిటీ చేతిలో ఇంటర్ ఓడిపోయింది. ఒనానా గత సీజన్‌లో UCLలో 13 మ్యాచ్‌లు ఆడాడు. ఒనానా 2019లో జోహన్ క్రూఫ్ షీల్డ్‌తో పాటు 2018-19, 2020-21లో KNVB కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.డి గియా 2012-13లో ప్రీమియర్ లీగ్, 2015-16లో ఒక FA కప్‌ను గెలుచుకున్నాడు.