Page Loader
సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మాంచెస్టర్ సిటీ
ఎర్లిండ్ హాలాండ్ 48 గోల్స్ చేశాడు

సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన మాంచెస్టర్ సిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2023
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. సెమీఫైనల్‌లో బేయర్న్ మ్యూనిచ్‌పై 4-1తేడాతో మాంచెస్టర్ సిటీ గెలుపొందింది. మరో మ్యాచ్‌లో బెన్‌ఫికాపై 5-3తో ఇంటర్ విజయం సాధించింది. సెమీ ఫైనల్ లో 25వ టైటిల్ కోసం రియల్ మాడ్రిడ్ తో మాంచెస్టర్ సిటీ తలపడనుంది. ఎర్లిండ్ హాలాండ్ సిటీ తరుపున మొదటి అర్ధభాగంలో పైనాల్టీని కోల్పోయాడు. అయితే 57వ నిమిషంలో గోల్ చేసి సత్తా చాడు. పెప్ గార్డియోలా కోచ్‌గా సెమీ-ఫైనల్‌కు చేరుకున్న 10వ జట్టు మాంచెస్టర్ సిటీ అవతరించింది. వరుసగా మూడోసారి సెమీ-ఫైనల్స్ లో అడుగు పెట్టేందుకు చాలా సంతోషంగా ఉందని గార్డియోలా చెప్పారు.

Details

నాకౌట్ దశలో రెండుసార్లు తలపడిన ఇంటర్, ఏసీ మిలన్

ఛాంపియన్స్ లీగ్ నాకౌట్ దశలలో ఇంటర్, AC మిలన్ రెండుసార్లు తలపడ్డాయి, 2002-03 సెమీ-ఫైనల్ 2004-05 క్వార్టర్-ఫైనల్‌లో AC మిలన్ రెండు టైలను గెలుచుకుంది.